బుధవారం 8 సెప్టెంబర్ 2010

నీ సంగతి చెప్పవయ్యా...

ముగ్గురు స్నేహితులు రోడ్డు ప్రమాదం లో మరణించారు. వాళ్ళ ని తీసుకుని వెళ్ళటానికి వచ్చిన యమభటులు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులూ మీ గురించి ఏమి మాట్లాడుకుంటే మీకు బాగుంటుందో చెప్పండి. మా వీలుని బట్టి అలా మాట్లాడేలా కుదురుతుందేమో చూస్తాం అన్నారు.


మొదటి వ్యక్తి: నా సమ కాలీకుల్లో నా అంత గొప్ప డాక్టర్ లేడని ఇక రాడనీ చెప్పు కోవాలి.


యమభటులు: ఒహ్... ఇంతేనా అదేం భాగ్యం. అలాగే చెప్పేలా చేస్తాం


రెండవ వ్యక్తి: నేనో ప్రముఖ టీచర్ ని. అందరూ నా అంత గొప్ప టీచర్ లేడని, ఎందరో విద్యార్ధుల భవిష్యత్తుని తీర్చి దిద్దానని అందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి


యమభటులు: ఒహ్... ఇంతేనా అదేం భాగ్యం. అలాగే చెప్పేలా చేస్తాం.


నీ సంగతి చెప్పవయ్యా అన్నారు యమభటులు అక్కడ ఉన్న మూడవ వ్యక్తి స్నేహిత్ తో.


స్నేహిత్: అరె... చూడండి మన స్నేహిత్ కదులుతున్నాడు అని అందరూ అనుకోవాలి.


యమభటులు: హా....!

మంగళవారం 7 సెప్టెంబర్ 2010

అర్ధరాత్రి ప్రసంగం

జోగప్ప పీకల దాకా తాగి అర్ధరాత్రిపూట రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. తనని చూసిన ఒక పోలీసు తనని ఆపాడు.

పోలీసు: అర్ధరాత్రి పూట ఇటు ఎక్కడికయ్యా?

జోగప్ప: తాగుడు వల్ల తాగుబోతుల వల్ల వచ్చే అనర్ధాల మీద ప్రసంగం వినటానికి వెళుతున్నాను.

పోలీసు: అర్ధరాత్రి పూట ప్రసంగాలా? ఈ టైం లో ఎవరయ్యా ప్రసంగాలు ఇచ్చేది?

జోగప్ప: మా ఆవిడ మరియు మా అమ్మ

మంగళవారం 31 ఆగస్టు 2010

ప్రశాంతం గా ....

జోగప్ప: నేను చనిపోయేటప్పుడు, మా తాత చనిపోయినంత ప్రశాంతం గా చనిపోవాలి రా

చెంగప్ప: మీ తాత ఎలా చనిపోయడురా?

జోగప్ప: కారు ప్రమాదం లో...

చెంగప్ప: కారు ప్రమాదం లో చనిపోతే ప్రశాంతం గా చని పోయాడు అంటావేమిట్రా?

జోగప్ప: మరి కాదా ఏమిటి కారు లో ఉన్న మిగిలిన వాళ్ళంతా భీతావహులై అరుస్తూ ఉంటే, ఆ కారు నడిపే మా తాత మాత్రం ప్రశాంతం గా నిద్ర లో చనిపోయాడు.

చెంగప్ప: ఆ..?

సోమవారం 30 ఆగస్టు 2010

మర్యాదగా అదెవరో చెప్పండి

ఒకానొక కాన్ఫరెన్స్ లో వివిధ కంపెనీ లో మేనేజర్లు కలిసారు. వారు రకరకాల విషయాలు చర్చించుకుంటూ ఉన్నారు.


అందులో ఒకాయన పైకి లేచి 'నా జీవితం లో మరుపురాని మధురక్షణాలు ఒక స్త్రీ కౌగిళ్ళ లో గడచిన క్షణాలు... కానీ ఆ స్త్రీ నా భార్య కాదు'


అక్కడి వారందరూ దిగ్భ్రాంతికి గురి అయ్యారు ఈ మనిషేంటీ ఎవరో స్త్రీ కౌగిట్లో గడిపిన క్షణాల గురించి బాహాటం గా చెప్పుతున్నాడు అనుకుంటూ ... ఎవరావిడ అని అడిగారు మిగిలిన వారు?


'మా అమ్మ... అమ్మ పొత్తిళ్ళలో గడచిన ఆ రోజులు మధురాతి మధురం' అంటూ ముగించాడు ఆయన.


కాన్ఫరెన్స్ హాలు చప్పట్లతో మారు మోగి పోయింది.

.

.

.

.

అక్కడ ఉన్న మేనేజర్ల లో జోగప్ప కూడా ఉన్నాడు.


తనకి ఆయన చెప్పింది బాగా నచ్చి ఈ జోక్ ని ఇంట్లో ప్రయోగించేసి అందరినీ ఆశ్చర్య పరిచెయ్యాలని భావించాడు.


సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఆ జోక్ ని మననం చేసుకుంటూనే ఉన్నాడు.

ఇంటికి రాగానే....


భార్యా మణితో 'నా జీవితం లో మరుపురాని మధురక్షణాలు ఒక స్త్రీ కౌగిళ్ళ లో గడచిన క్షణాలు... కానీ

ఆ స్త్రీ నువ్వు కాదు'


యధా విధిగా జోగప్ప భార్యామణి దిగ్భ్రాంతికి గురి అయ్యింది.


'ఏమిటి మీరనేది? మర్యాదగా అదెవరో చెప్పండి' అంది కోపంగా.


ఆ కోపం చూసిన కంగారు లో జోగప్ప ఆ జోక్ లో మిగతా సగం మరచి పోయాడు.


పది క్షణాలు దీర్ఘం గా ఆలోచించి ఇలా చెప్పాడు. 'ఆవిడ ఎవరో నేను మరచి పోయాను. ఎంత ఆలోచించినా గుర్తు రావటం లేదు.'


తరువాత ఏమి జరిగిందో ప్రత్యేకం గా చెప్పాలా?

పోస్ట్ చెయ్య వచ్చుగా

పోస్ట్ మాన్: మీకు ఈ పాకెట్ బట్వాడా చెయ్యటానికి 10 కిలో మీటర్లు రావాల్సి వచ్చింది.

జోగప్ప : నీకేమైనా పిచ్చా ఏందీ? ఇంత దూరం వచ్చే బదులు పోస్ట్ చెయ్య వచ్చుగా?

పోస్ట్ మాన్: !!!!!!!!!!!!