ఒకానొక కాన్ఫరెన్స్ లో వివిధ కంపెనీ లో మేనేజర్లు కలిసారు. వారు రకరకాల విషయాలు చర్చించుకుంటూ ఉన్నారు.
అందులో ఒకాయన పైకి లేచి 'నా జీవితం లో మరుపురాని మధురక్షణాలు ఒక స్త్రీ కౌగిళ్ళ లో గడచిన క్షణాలు... కానీ ఆ స్త్రీ నా భార్య కాదు'
అక్కడి వారందరూ దిగ్భ్రాంతికి గురి అయ్యారు ఈ మనిషేంటీ ఎవరో స్త్రీ కౌగిట్లో గడిపిన క్షణాల గురించి బాహాటం గా చెప్పుతున్నాడు అనుకుంటూ ... ఎవరావిడ అని అడిగారు మిగిలిన వారు?
'మా అమ్మ... అమ్మ పొత్తిళ్ళలో గడచిన ఆ రోజులు మధురాతి మధురం' అంటూ ముగించాడు ఆయన.
కాన్ఫరెన్స్ హాలు చప్పట్లతో మారు మోగి పోయింది.
.
.
.
.
అక్కడ ఉన్న మేనేజర్ల లో జోగప్ప కూడా ఉన్నాడు.
తనకి ఆయన చెప్పింది బాగా నచ్చి ఈ జోక్ ని ఇంట్లో ప్రయోగించేసి అందరినీ ఆశ్చర్య పరిచెయ్యాలని భావించాడు.
సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఆ జోక్ ని మననం చేసుకుంటూనే ఉన్నాడు.
ఇంటికి రాగానే....
భార్యా మణితో 'నా జీవితం లో మరుపురాని మధురక్షణాలు ఒక స్త్రీ కౌగిళ్ళ లో గడచిన క్షణాలు... కానీ
ఆ స్త్రీ నువ్వు కాదు'
యధా విధిగా జోగప్ప భార్యామణి దిగ్భ్రాంతికి గురి అయ్యింది.
'ఏమిటి మీరనేది? మర్యాదగా అదెవరో చెప్పండి' అంది కోపంగా.
ఆ కోపం చూసిన కంగారు లో జోగప్ప ఆ జోక్ లో మిగతా సగం మరచి పోయాడు.
పది క్షణాలు దీర్ఘం గా ఆలోచించి ఇలా చెప్పాడు. 'ఆవిడ ఎవరో నేను మరచి పోయాను. ఎంత ఆలోచించినా గుర్తు రావటం లేదు.'
తరువాత ఏమి జరిగిందో ప్రత్యేకం గా చెప్పాలా?







10 వ్యాఖ్యలు:
హ...హ...హ... పొపన
అది సరే ! ముందు మీరు ఈ వేమన ఖతిని మీ బ్లాగులో మాకు కనిపించేలా ఎలా పొందుపఱచగలిగారో (embedding) ఆ రహస్యం చెప్పి పుణ్యం కట్టుకోగలరు.
ha ha ha
baagndandi
:))
అందరికీ కృతఙ్ఞతలు.
@తాడేపల్లి గారూ...
మైక్రోసాఫ్ట్ వర్డ్ లో వేమన ఖతి కి మార్చి దాన్ని ఇక్కడ పొందుపరిచాను.
నెనర్లు. నేనూ ప్రయత్నిస్తాను.
హ హ. భలే. అచ్చం మా లింగేష్ లాగా ఉన్నాడీ జోగప్ప
హహ్హహ్హా.. సూపర్!
:)
@కొత్త పాళీ గారూ,
@చదువరి గారూ,
@కమల్ గారూ,
అందరికీ ధన్య వాదములు
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి